బంపర్ ఛాన్స్ కొట్టేసిన ధమాకా బ్యూటీ.!
- March 01, 2023
‘ధమాకా’ బ్యూటీ జోరు మామూలుగా లేదండోయ్. ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అదే ‘ఉస్తాద్ భగత్ సింగ్’.
ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా పూజాహెగ్దేని అనుకున్నారు. అయితే, ఆ ప్లేస్‌ని శ్రీలీల ఆక్యుపై చేసేసిందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ బబ్లీగా వుంటుందట. అలాగే, పవన్ కళ్యాణ్‌తో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా చాలా ఎనర్జిటిక్‌గా వుండబోతోందట.
దాంతో ఆ రోల్‌లో శ్రీలీల అయితే బావుంటుందని అనుకుంటున్నారట. దాదాపు శ్రీలీల పేరు కన్‌ఫామ్ అయిపోయిందనీ అంటున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో చాలా క్రేజీ ప్రాజెక్టులున్నాయ్. వరుస ఆఫర్లతో శ్రీలీల డైరీ ఫుల్‌గా నిండిపోతోంది. చూస్తుంటే.. పాప త్వరలోనే స్టార్ హీరోయిన్ అయిపోయేలా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్‌కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









