రామ్ చరణ్ - ఎన్టీయార్ ఆస్కార్ రచ్చ.?
- March 02, 2023‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ని బెస్ట్ ఒరిజినల్ కేటగిరిలో ఆస్కార్ నామినేషన్లకు ఎంపికైన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా, ‘నాటు నాటు’ సాంగ్ అంతర్జాతీయ వేదికలపై మార్మోగిపోతోంది. ఇక్కడా అక్కడా అనే తేడా లేదు.. అంతర్జాతీయ వేదికలపై నాటు నాటు నామజపమే జరుగుతోంది.
ఈ నేపథ్యంలో అమెరికాలోనే వున్న రామ్ చరణ్ పలు ఆంగ్ల పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తూ మన తెలుగు సినిమా గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెబుతున్నాడు.
ఇదిలా వుంటే, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు రామ్ చరణ్. ఇదే అవార్డు ఫంక్షన్‌కి ఎన్టీయార్ కూడా హాజరవ్వాల్సి వుండగా, తారకరత్నమరణం కారణంగా ఎన్టీయార్ వెళ్లలేకపోయాడు.
రామ్ చరణ్ అమెరికాలో చేస్తున్న సందడి నేపథ్యంలో ఎన్టీయార్ అభిమానులుగా చెప్పుకునే కొందరు ఆకతాయిలు.. ఆ ముసుగుతో సోషల్ మీడియా వేదికగా అత్యంత జుగుప్సాకరంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్ల కారణంగా అంతర్జాతీయ వేదికలపై మన తెలుగు సినిమా పరువు పోయే పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. హీరోల మధ్య లేని తారతమ్యాలు.. విబేధాలు.. ఇదిగో ఇలా అభిమానులమని చెప్పుకుని తిరిగే కొందరి వల్ల నిజమే అంతర్జాతీయ వేదికలపై పరువు పోతుంది మరి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..