యూఏఈలో తేలికపాటి భూకంపం..!
- March 03, 2023
యూఏఈ: గురువారం సాయంత్రం యూఏఈలో స్వల్ప భూకంపం సంభవించింది. కొందరు నివాసితులు భూకంప ప్రకంపనలను అనుభవించినట్లు చెబుతున్నారు. రిక్టర్ స్కేలుపై ఇది 1.9గా నమోదైంది. భూకంపం దిబ్బా అల్ ఫుజైరా తీరంలో రాత్రి 8 గంటలకు నమోదైందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (ఎన్సిఎం) తెలిపింది. అయితే, భూకంపాల గురించి యూఏఈ నివాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని NCM డిపార్ట్మెంట్ ఆఫ్ సిస్మోలజీ డైరెక్టర్ ఖలీఫా అల్ ఎబ్రీ తెలిపారు. "సాధారణంగా ఒక సంవత్సరంలో రెండు నుండి మూడు వరకు స్వల్ప ప్రకంపనలు వస్తుంటాయి. ఈ ప్రకంపనలు సెన్సార్ల ద్వారా మాత్రమే గుర్తించవచ్చు. ఇవి భవనాలు లేదా మౌలిక సదుపాయాలను ప్రభావితం చేయవు." అని వెల్లడించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!