ఒమన్‌కి చెందిన సలామ్‌ఎయిర్ విమానం.. భారత్‌లో అత్యవసరంగా ల్యాండింగ్
- March 03, 2023
మస్కట్: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నుంచి మస్కట్‌కు బయలుదేరిన సలామ్‌ఎయిర్ విమానంలో పొగలు రావడంతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు ఒమన్‌కు చెందిన సలామ్‌ఎయిర్ సుల్తానేట్ తెలిపింది. "చాటోగ్రామ్ (చిట్టగాంగ్) నుండి మస్కట్ వెళ్లే సలామ్ ఎయిర్ విమానంలో కార్గో హోల్డ్‌లో పొగ ఉన్నట్లు గుర్తించిన అలారం కారణంగా సాంకేతిక సమస్య తలెత్తింది. ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని నాగ్‌పూర్ విమానాశ్రయానికి మళ్లించారు. వెంటనే ఎమర్జెన్సీ, ఇంజినీరింగ్ బృందం ద్వారా విమానాన్ని తనిఖీ చేశారు. మంటలను గుర్తించలేదు. విమానం నాగ్‌పూర్ విమానాశ్రయం నుండి బయలుదేరింది. ప్రయాణీకులు, సిబ్బంది అందరూ మస్కట్ విమానాశ్రయానికి తిరిగి వచ్చారు." అని సలామ్‌ఎయిర్ తన ప్రకటనలో వెల్లడించింది. బంగ్లాదేశ్ నుంచి బయలుదేరిన విమానంలో దాదాపు 200 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!