రమదాన్: మక్కా, మదీనా మధ్య 100 రైలు సర్వీసులు
- March 03, 2023
జెడ్డా : పవిత్ర రమదాన్ మాసంలో పీక్ సీజన్లో మక్కా, మదీనా మధ్య రైలు సర్వీసుల సంఖ్యను రోజుకు 100 కంటే ఎక్కువ ట్రిప్పులకు పెంచాలని నిర్ణయించినట్లు హరమైన్ హై-స్పీడ్ రైల్వే పేర్కొంది. రమదాన్, ఉమ్రా సీజన్ నేపథ్యంలో కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జెడ్డా, మదీనాలోని ప్రిన్స్ ముహమ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా సౌదీ అరేబియాకు ఉమ్రా యాత్రికులు, సందర్శకులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మేనేజ్మెంట్ వర్గాలు తెలిపాయి. హరమైన్ హై-స్పీడ్ రైలులో ఉమ్రా యాత్రికులు, పవిత్ర నగరాలైన మక్కా- మదీనాలకు.. అలాగే జెడ్డా నగరం, కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ ఆఫ్ రాబిగ్కు సందర్శకులు భారీ సంఖ్యలో వస్తున్నారని.. మక్కా, మదీనాలను జెడ్డా, రబీగ్ మీదుగా కలిపే ఈ రైల్వే లైను ద్వారా ఇప్పటివరకు 25,000 కంటే ఎక్కువ సర్వీసులను నడిపంచినట్లు హరమైన్ హై-స్పీడ్ రైల్వే పేర్కొంది. సులేమానియాలోని జెడ్డా స్టేషన్లో ప్రయాణాల సంఖ్య పెరిగినట్లు తెలిపింది. ప్రస్తుతం మక్కా, జెద్దా సులేమానియా మధ్య 58 ట్రిప్పులు నడుస్తున్నాయని, అలాగే సులేమానియా స్టేషన్, కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య 26 ట్రిప్పులు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. రద్దీ సమయాల్లో మక్కా, మదీనా మధ్య గంటకు రెండు ట్రిప్పులు.. రద్దీ సమయాల్లో కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టేషన్, మక్కా స్టేషన్ మధ్య ప్రతి గంటకు ఒక ట్రిప్పు ఉంటుందని హరమైన్ హై-స్పీడ్ రైల్వే తెలిపింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!