విమానంలో మరోసారి మూత్ర విసర్జన ఘటన..
- March 05, 2023
గత ఏడాది చివరిలో న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో వృద్ధురాలి పై మూత్ర విసర్జన చేసిన ఘటన సంచలనంగా మారింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాజాగా అలాంటి ఘటన మరొకటి అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మద్యం మత్తులో ఓ ప్రయాణీకుడు పక్కనేఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన చేశాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
న్యూయార్క్ నుంచి అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం శుక్రవారం రాత్రి 9.16 గంటలకు న్యూఢిల్లీ బయలుదేరింది. 14గంటల16 నిమిషాల తర్వాత మరుసటిరోజు ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే, విమానం ప్రయాణ సమయంలో అమెరికాలోని ఓ యూనివర్శిటీ విద్యార్థి నిద్రమత్తులో మూత్ర విసర్జన చేయడంతో పక్కనే ప్రయాణికులపై పడినట్లు తెలిపారు. విమానం ల్యాండ్ కాగానే సదరు నిందితున్ని సీఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకొని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థి నిద్రమత్తులో మూత్రవిసర్జన చేయగా పక్కనేఉన్న తమపై పడినట్లు ప్రయాణీకులు విమాన సిబ్బంది తెలియజేశారు. అయితే, బాధితుడు మాత్రం దీన్ని పోలీసుల వరకు తీసుకెళ్లవద్దని విజ్ఞప్తి చేయడంతోపాటు, తోటి ప్రయాణీకులకు క్షమాపణలు చెప్పారు. దీంతో వారు ఈ విషయాన్ని వదిలేశారు.
విమాన సిబ్బంది మాత్రం ఈ విషయాన్ని పైలట్ ద్వారా ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఏటీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఏటీసీ అధికారులు సీఐఎస్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. విమానం ల్యాండ్ కగానే నిందితున్ని అరెస్టు చేసి ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు ఇరుపక్షాల వాదనలను నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!