#ఎన్టీయార్ 30.! జాన్వీ లుక్ చూశారా.?
- March 06, 2023
ఎన్టీయార్ 30 నుంచి అందరూ ఆశిస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. ఎన్టీయార్ - కొరటాల కాంబినేషన్ మూవీగా తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మల్లగుల్లాలు పట్టారు ఇన్నాళ్లూ. ఎట్టకేలకు సినిమాలో హీరోయిన్ ఫిక్సయ్యింది. అందరూ అనుకున్నట్లే ఇంతవరకూ సాధ్యం కాని విషయాన్ని సుసాధ్యం చేశారు ఎన్టీయార్ 30 అండ్ టీమ్. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ని టాలీవుడ్‌కి దించుతున్నారు.
ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, తాజాగా సినిమా నుంచి జాన్వీ ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేసేశారు.
తుఫానులో ప్రశాంతంగా అన్నట్లుగా ఓ క్యాప్షన్ ఇచ్చి మరీ జాన్వీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పదహారణాల తెలుగమ్మాయిలా లంగా వోనీలో నిండుగా కనిపిస్తోంది జాన్వీ కపూర్ ఈ లుక్‌లో. ఈ రోజు జాన్వీ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీయార్ 30 నుండి ఈ అదిరిపోయే అప్డేట్ ఇచ్చి అటు ఎన్టీయార్ ఫ్యాన్స్‌నీ, ఇటు జాన్వీ కపూర్ ఫ్యాన్స్‌నీ ఖుషీ చేసింది కొరటాల అండ్ టీమ్.

తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









