విజయవాడ సిటీ పోలీసు శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా సాయి కుమార్
- June 20, 2015
విజయవాడ సిటీ పోలీసు శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు సాయి కుమార్ నిమితులయ్యారు. సిటీ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు అంగీకరించినందుకుగాను నగర పోలీస్ కమీషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ పోలీసులు 'నాలుగో సింహం' పేరుతో ఓ యాప్ రూపొందించారు. జూన్ 21న సాయి కుమార్ చేతుల మీదుగా ఈ యాప్ విడుదల చేయనున్నారు. విజయవాడ కమీషనరేట్ పరిధిలో పోలీసులు పలు ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటికి సాయి కుమార్ ప్రచార కర్తగా ఉండబోతున్నారు. తెలుగులో సాయికుమార్ నటించిన 'పోలీస్ స్టోరీ' చిత్రం పెద్ద హిట్టయింది. పోలీస్ అంటే ఇలానే ఉండాలి అనే రీతిలో ఈ చిత్రం ప్రేక్షకుల గుండెల్లో పాతుకు పోయింది. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే...కనిపించని ఆ నాలుగో సింమేరా పోలీస్ అంటూ సాయి కుమార్ చెప్పిన డైలాగ్ ఎవరూ మరిచిపోలేనంతగా పాపులర్ అయింది.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







