ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో బస్సు లోయలో పడి 13 మంది దుర్మరణం..

- May 04, 2016 , by Maagulf
ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో బస్సు లోయలో పడి 13 మంది దుర్మరణం..

 బస్సు లోయలో పడి 13 మంది దుర్మరణం చెందిన ఘటన ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి గద్వా ప్రాంతం నుంచి రాయ్‌పూర్‌ వెళ్తున్న ప్రైవేటు బస్సు దఢోవాఘాట్‌ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందగా మరో 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గడ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com