డ్రగ్స్ ట్రాఫికర్లపై కువైట్ ఉక్కుపాదం
- March 12, 2023
కువైట్: డ్రగ్స్ ట్రాఫికర్ల నుండి కువైట్ భీకర యుద్ధాన్ని ఎదుర్కొంటోందని కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, రక్షణ శాఖ తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబాహ్ అన్నారు. 120 కిలోల హషీష్, 36,000 క్యాప్టాగాన్ మాత్రలు, ఒక కిలో షాబు, 250 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకోవడంపై ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలు, యువతకు హాని కలిగించే డ్రగ్స్ వ్యాపారులను తాము అనుమతించమని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల స్మగ్లర్లను ఎదుర్కోవడంలో.. అన్ని స్మగ్లింగ్ పద్ధతులు, ప్రయత్నాలను తిప్పికొట్టడంలో అన్ని రంగాలలోని భద్రతా సిబ్బంది నిర్విరామ కృషిని ఆయన ప్రశంసించారు. యాంటీ నార్కోటిక్స్ సిబ్బంది మరింత సిద్ధంగా.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రితో పాటు మంత్రిత్వ శాఖలోని కొందరు సీనియర్ అధికారులు, క్రిమినల్ సెక్యూరిటీ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ షేక్ ముబారక్ సలేం అల్-అలీ అల్-సబాహ్ లు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







