కీటో డైట్ ఫాలో చేస్తున్నారా.. అయితే గుండె జర జాగ్రత్త.!
- March 13, 2023బరువు తగ్గడం కోసం ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాఠిస్తున్న డైట్ విధానం ‘కీటో డైట్’. అవును నిజమే.. ఈ పద్ధతిలో చాలా తొందరగా బరువు తగ్గుతున్నారు.
కానీ, ఈ పద్ధతిని పాటించే వారిలో గుండె జబ్బు వచ్చే ప్రమాదాలు అధికంగా వున్నట్లు అమెరికన్ యూనివర్సిటీ అధ్యయనాల్లో తేలింది. కీటో డైట్ ఫాలో చేసేవారి ఆహారంలో కార్బో హైడ్రేట్స్ చాలా తక్కువగా వుంటున్నాయట. కొవ్వు పదార్ధాలు అధికంగా వుంటున్నట్లు వారు గుర్తించారు.
తద్వారా గుండెకు సంబంధించిన రక్త నాళాలు మూసుకుపోవడం, చాతిలో నొప్పి, ఆ పై కార్డియాక్ అరెస్ట్ వంటివి వస్తున్నాయని ఆ అధ్యయనాల ద్వారా తెలిసింది.
కార్భోహైడ్రేట్స్ పరిమితంగా తీసుకోవడం వల్ల శరీరం శక్తి కోసం కొవ్వును విచ్ఛిన్నం చేయవలసి వస్తుంది. అందుకోసం కాలేయం కీటోన్ల ఉత్పత్తి పెంచాల్సి వస్తుంది. ఈ కారణంగా శరీరంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇదే గుండె జబ్బులకు దారి తీస్తోందని తాజా ప్రయోగాల ద్వారా తేలింది. సో.! కీటో డైట్ అనుసరించే వారు గుండె విషయంలో తస్మాత్ జాగ్రత్త.!
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?