కీటో డైట్ ఫాలో చేస్తున్నారా.. అయితే గుండె జర జాగ్రత్త.!

- March 13, 2023 , by Maagulf
కీటో డైట్ ఫాలో చేస్తున్నారా.. అయితే గుండె జర జాగ్రత్త.!

బరువు తగ్గడం కోసం ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాఠిస్తున్న డైట్ విధానం ‘కీటో డైట్’. అవును నిజమే.. ఈ పద్ధతిలో చాలా తొందరగా బరువు తగ్గుతున్నారు. 

కానీ, ఈ పద్ధతిని పాటించే వారిలో గుండె జబ్బు వచ్చే ప్రమాదాలు అధికంగా వున్నట్లు అమెరికన్ యూనివర్సిటీ అధ్యయనాల్లో తేలింది. కీటో డైట్ ఫాలో చేసేవారి ఆహారంలో కార్బో హైడ్రేట్స్ చాలా తక్కువగా వుంటున్నాయట. కొవ్వు పదార్ధాలు అధికంగా వుంటున్నట్లు వారు గుర్తించారు. 

తద్వారా గుండెకు సంబంధించిన రక్త నాళాలు మూసుకుపోవడం, చాతిలో నొప్పి, ఆ పై కార్డియాక్ అరెస్ట్ వంటివి వస్తున్నాయని ఆ అధ్యయనాల ద్వారా తెలిసింది. 

కార్భోహైడ్రేట్స్ పరిమితంగా తీసుకోవడం వల్ల శరీరం శక్తి కోసం కొవ్వును విచ్ఛిన్నం చేయవలసి వస్తుంది. అందుకోసం కాలేయం కీటోన్ల ఉత్పత్తి పెంచాల్సి వస్తుంది. ఈ కారణంగా శరీరంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇదే గుండె జబ్బులకు దారి తీస్తోందని తాజా ప్రయోగాల ద్వారా తేలింది. సో.! కీటో డైట్ అనుసరించే వారు గుండె విషయంలో తస్మాత్ జాగ్రత్త.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com