తెలంగాణ: రానున్న మూడు రోజుల్లో వర్షాలు
- March 13, 2023
హైదరాబాద్: రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 15,16,17 తేదీల్లో పలు చోట్ల వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు సూచిస్తున్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో వర్షం ప్రభావం ఎక్కువున్నట్లు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, పెద్దపల్లి, భూపాలపల్లి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, మన్మకొండ, మహబూబాబాద్, కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువుండనుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







