అంతర్జాతీయ మహిళా దినోత్సవం: మహిళా ఫ్రంట్‌లైన్ కార్మికులతో సంబురాలు
- March 13, 2023
దుబాయ్: కమ్యూనిటీ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లో భాగంగా దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్‌లోని మహిళా ఫ్రంట్‌లైన్ వర్కర్లతో కలిసి దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా మార్చి 8, 12వ తేదీల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు.డల్స్కో లేబర్ క్యాంప్, ఈఎఫ్ఎస్ క్యాంప్, ఎస్టీఎస్ గ్రూప్ క్యాంప్ వంటి వివిధ ప్రదేశాలలో నిర్వహించిన సెలబ్రేషన్స్ సందర్భంగా మహిళా కార్మికులకు మహిళ ఆరోగ్య సమస్యల పై అవగాహన కల్పించారు.అనంతరం రేషన్ సరుకులను పంపిణీ చేశారు.అదే విధంగా #నారీశక్తి వారోత్సవాల్లో భాగంగా మహిళా ఆరోగ్యం, ఆర్థిక స్వావలంభనపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా తమ కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యక్రమాలకు నిరంతర మద్దతునిస్తున్న ఇండియన్ పీపుల్స్ ఫోరమ్, యూఏఈ, ఎఫ్ఓఐ, డాబర్ ఇంటర్నేషనల్, లులూ గ్రూప్, ఎన్ఎంకేపీ లకు భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం కృతజ్ఞతలు తెలియజేసింది.




తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







