జెడ్డా ఈవెంట్స్ క్యాలెండర్ 2023 ఆవిష్కరణ
- March 14, 2023
జెడ్డా : జెడ్డా గవర్నరేట్‌లోని నేషనల్ క్యాలెండర్ కమిటీ ఛైర్మన్ ప్రిన్స్ అబ్దుల్లా బిన్ బందర్ 2023 సంవత్సరానికి జెడ్డా ఈవెంట్స్ క్యాలెండర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. జెడ్డా ఈవెంట్స్ క్యాలెండర్ 2023 సంవత్సరం పొడవునా కొనసాగుతుందని, ఇది క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రతిష్టాత్మక దృష్టికి అనుగుణంగా, ఈ రంగంలో వారి అభిరుచులకు అనుగుణంగా ఉంటుందని ప్రిన్స్ అబ్దుల్లా చెప్పారు. ప్రిన్స్ అబ్దుల్లా ప్రకారం, క్యాలెండర్లో అనేక అంతర్జాతీయ, సాంస్కృతిక,సముద్ర పండుగలు, ఈవెంట్లు ఉంటాయి. కాగా, వాటి వివరాలు తరువాత ప్రకటించనున్నట్లు అధికాకులు తెలిపారు. ప్రిన్స్ అబ్దుల్లా మాట్లాడుతూ.. జెడ్డా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కార్యకలాపాలను ఏడాది పొడవునా పొడిగించడం వల్ల స్థానిక, విదేశీ సందర్శకులకు ప్రత్యేకమైన, మరపురాని అనుభూతిని కలుగజేస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







