లవంగంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.?
- March 14, 2023మసాలా దినుసులా లవంగాన్ని ఉపయోగిస్తుంటాం. కానీ, లవంగంతో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయ్. లవంగంలో యూజనల్ అనే రసాయన పదార్ధం వుంటుంది.
ఈ రసాయన పదార్ధం కారణంగా నొప్పిని తగ్గించే లక్షణం లవంగానికి చాలా ఎక్కువ. పంటి నొప్పి వచ్చినప్పుడు లవంగాన్ని ఆ నొప్పి వున్న ప్రాంతంలో వుంచితే నొప్పి లాగేస్తుంది.
అలాగే, దగ్గు, ఆయాసం.. వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు లవంగం మంచి ఔషధం. లవంగం, పుదీనా, తులసి కలిపిన టీని రోజూ తీసుకోవడం వల్ల అనేక రకాల శ్వాస సంబంధిత వ్యాధులు క్రమంగా నివారించబడతాయి.
అలాగే, జీర్ణం కాకపోవడం, కడుపుబ్బరం, వికారం వంటి సమస్యలను తగ్గించడానికి తేనె, లవంగం కలిపిన మిశ్రమాన్ని నీటిలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
కూరలకు మంచి రుచినే కాదు, సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి బాధల్ని నివారించడంలో లవంగం వంటింటి చిట్కాల్లో కీలక పాత్ర వహిస్తుంది.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్