క్లబ్ వరల్డ్ కప్ 2023: సన్నాహాలను సమీక్షించిన ఫిఫా
- March 16, 2023
రియాద్: 2023 క్లబ్ వరల్డ్ కప్‌కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది. దీనికి సంబంధించిన సన్నాహాలను సమీక్షించేందుకు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్ (FIFA) ప్రతినిధి బృందం సౌదీ అరేబియాను సందర్శించింది. వారికి సౌదీ అరేబియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ఇబ్రహీం అల్-ఖాస్సెమ్ స్వాగతించారు. 2023 డిసెంబర్ 12 నుండి 22 వరకు జరిగే టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చే స్టేడియాలలోని సౌకర్యాలను ఫిఫా ప్రతినిధి బృందం సభ్యులు తనిఖీలు చేశారు. కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ స్టేడియం, ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫహద్ స్టేడియం, కింగ్ సౌద్ యూనివర్సిటీ స్టేడియాలలో పర్యటించి ఏర్పాట్లపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఫిఫా ప్రతినిధి బృందం రియాద్‌లోని శిక్షణా కేంద్రాలను కూడా సందర్శించింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!