ఎక్కువ నీరు తీసుకున్నా ప్రమాదమే సుమా.!

- March 16, 2023 , by Maagulf
ఎక్కువ నీరు తీసుకున్నా ప్రమాదమే సుమా.!

ఆరోగ్యంగా వుండాలంటే తగినంత నీరు త్రాగాల్సిందే అని వైద్యులు చెబుతుంటారు. కాలమేదైనా సరే, సరిపడినంత నీరు శరీరానికి అవసరం అని వైద్యులు సూచిస్తుంటారు. 
అయితే, వైద్యుని సలహా మేరకు.. కొందరు సడెన్‌గా ఎక్కువ నీటిని తాగేయడం.. సడెన్‌గా తాగకుండా వుండిపోవడం వంటివి చేస్తుంటారు.
ఈ రెండూ ప్రమాదకరమే. అధిక నీరు తీసుకోవడం వల్ల మూత్ర పిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. నీటిని తీసుకుని శరీరంలోని వ్యర్ధాలను శుద్ధి చేయడమే మూత్ర పిండాలు చేసే పని. సరిపడా నీటిని తీసుకుంటే, ఆ మూత్రపిండాలి మెకానిజమ్ సవ్యంగా సాగుతుంది. అదే అధిక శాతంలో నీరు తీసుకోవడం వల్ల వాటిపై పని భారం పెరుగుతుంది.
అలాగే, అధికంగా నీటిని తీసుకోవడం.. తద్వారా మూత్రం సమస్య.. ఆపుకుంటే అదో బాధ.. పోవాలంటే ఇంకో బాధ.. తద్వారా కిడ్నీ సమస్యలు.. అందుకే తాగే నీటి మోతాదు విషయంలో కాస్త జాగ్రత్తలు పాఠించాలి సుమా.
శరీరంలో 70 శాతం నీరుంటుంది. మెదడులో 75శాతం, మూత్రపిండాల్లో 90 శాతం వుంటుంది. ఇది రక్తం (82 శాతం) కన్నా ఎక్కువే. 
వైద్య సలహా ప్రకారం రోజుకు 8 నుంచి 10 గ్లాసులు.. అంటే రెండు లీటర్ల నీటిని మాత్రమే తీసుకోవాలని.. ఎండలో ఎక్కువ పని చేసే వారు ఎక్కువగా శారీరక శ్రమ చేసే వారు మాత్రం మరో రెండు గ్లాసులు ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com