ముగిసిన ‘ఖురైన్ కల్చరల్ ఫెస్టివల్’.. హాజరైన షేక్ అహ్మద్
- March 17, 2023
కువైట్: షేక్ జాబర్ అల్-అహ్మద్ కల్చరల్ సెంటర్లో జరిగిన 28వ ఖురైన్ కల్చరల్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమానికి ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా బుధవారం హాజరయ్యారు. ఫెస్టివల్ సందర్భంగా ఈ సంవత్సరం విశిష్టవ్యక్తి అవార్డును కవి, సౌదీ యువరాజు బాదర్ బిన్ అబ్దుల్-మొహ్సేన్ అల్-సౌద్కు ప్రధాన మంత్రి ప్రదానం చేశారు. హిస్ హైనెస్ ది ప్రీమియర్ 2023 రాష్ట్ర బహుమతుల విజేతలను కూడా సత్కరించారు. కువైట్లోని నాగరిక ప్రతిష్టను ప్రతిబింబించే విధంగా ఖురైన్ కల్చరల్ ఫెస్టివల్ నిర్వహించినట్లు హిస్ హైనెస్ షేక్ అహ్మద్ నవాఫ్ చెప్పారు. ఈసందర్భంగా ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించి వారిని సత్కరించామన్నారు. ఈ ఫెస్టివల్ ను విజయవంతం చేయడం కోసం సమాచార మంత్రిత్వ శాఖ, నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్, ఆర్ట్స్ అండ్ లెటర్స్ (NCCAL) సిబ్బంది చేసిన కృషిని ఆయన అభినందించారు.ఇంకా ఈ కార్యక్రమంలో కువైట్లోని సౌదీ రాయబారి ప్రిన్స్ సుల్తాన్ బిన్ సాద్ అల్-సౌద్, అమిరి దివాన్ సలహాదారు మహ్మద్ అబ్దుల్లా అబుల్హాసన్, సీనియర్ రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







