గివింగ్ బాస్కెట్ క్యాంపెయిన్: రమదాన్‌లో నిరుపేదలకు ఆహారం
- March 17, 2023
దోహా: అవ్కాఫ్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎండోమెంట్స్ రాబోయే రమదాన్ మాసంలో పేద కుటుంబాలు, కార్మికులకు ఆహారాన్ని అందించడానికి “గివింగ్ బాస్కెట్” క్యాంపెయిన్ ను ప్రారంభించింది. 2022 పవిత్ర రమదాన్ మాసంలో ఖతార్‌లోని 4,329 నిరుపేద కుటుంబాలకు క్యాంపెయిన్ ను హిఫ్జ్ అల్ నైమా సెంటర్ సహకారంతో వరుసగా నాల్గవ సంవత్సరం కూడా ప్రారంభించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎండోమెంట్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్. షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ ఘనిమ్ అల్ థానీ మాట్లాడుతూ.. “గివింగ్ బాస్కెట్” అనేది కోవిడ్-19 మహమ్మారి ప్రారంభం నుండి హిఫ్జ్ అల్ నైమా సెంటర్ సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. పవిత్ర మాసంలో అవసరమైన కుటుంబాలు, కార్మికులకు ఆహార బుట్టలను పంపిణీ చేయడానికి డైరెక్టరేట్ ఈ క్యాంపెయిన్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, దాతలు వివిధ ఎండోమెంట్ మార్గాల ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







