సింగపూర్ లో ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సములు
- March 20, 2023
సింగపూర్: స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ వారు 2023 మార్చ్ 18 శనివారం నాడు శ్రీ సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సములను రామకృష్ణా మిషన్ శారదాహాల్ నందు ఘనంగా నిర్వహించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపకురాలు యడవల్లి శేషుకుమారి మొట్ట మొదటిసారిగా అందరూ తెలుగువారిచే త్యాగరాజఆరాధనోత్సవములు జరపాలని దృఢసంకల్పంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని అందరి ముందుకు తీసుకురావటం కొనియాడదగ్గ విషయం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యడవల్లి శేషుకుమారి సంగీత గురువు గౌరీ గోకుల్, రామకృష్ణా మిషన్ స్వామీజీ గౌరవ అతిధిగా హాజరు కావటం విశేషం.ఈ కార్యక్రమానికి "TAS (మనం తెలుగు) అసోసియేషన్", "శ్రీ సాంస్కృతిక కళా సారథి సింగపూర్", STS ఎక్స్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ B.V.R చౌదరి ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయ్యారు.
ఈ శుభ సందర్భం లో స్వరలయ ఆర్ట్స్ సంస్థకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఇండియా కు ఎఫిలియేషన్ లభించడం సద్గురు త్యాగరాజస్వామి కృపగా భావించి తమ గురువుల సమక్షంలో యూనివర్సిటీ పత్రమును ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యడవల్లి శేషు కుమారి, సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, చిరంజీవి కిరీటి దేశిరాజు, కుమారి యడవల్లి విద్య, చిరంజీవి యడవల్లి శ్రీరామచంద్ర మూర్తి,శరజ అన్నదానం,రాధికా నడదూర్, రమ వీరందరూ త్యాగరాజ పంచరత్న కీర్తనలను ఆలపించగా.. పలువురు చిన్నారులు, యడవల్లి శేషుకుమారి శిష్యులు "త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలను" ఆలపించారు.
ఆదిత్య సత్యనారాయణ వయోలిన్ పై , శివ కుమార్, కార్తీక్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు.ఈ కార్యక్రమానికి రోజా రమణి ఓరుగంటి, సౌజన్యలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.ఇంత గొప్పగా నిర్వహింపడిన ఈ కార్యక్రమానికి దాదాపుగా 200మంది హాజరు కావటమే కాకుండా..సాంఘిక మాధ్యమాలాద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.మొత్తం మీద స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ వారు మొట్ట మొదటి సారి తెలుగు వారిచే నిర్వహించిన శ్రీ సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవములకు విశేష స్పందన లభించింది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!