'TAAD' ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

- March 21, 2023 , by Maagulf
\'TAAD\' ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

 అబుధాబి: తెలుగు అసోసియేషన్ అబుధాబి (TAAD) ఆధ్వర్యంలో మార్చి 19న అబుధాబిలోని  ఇంటర్నేషనల్ స్కూల్, ముసఫా లో ఘనంగా ఉగాది వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సినీ డైరెక్టర్ బాబీ,  సినీ రచయిత కోన వెంకట్ లతోపాటు వాల్తేరు వీరయ్య డైరెక్షన్ టీమ్ పాల్గొన్నారు. 'గెస్ట్ అఫ్ హానర్' గా యూఏఈ పౌరులు అబ్దుల్లా అల్ సువైదీ, ఫాహద్ అల్ షంసీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అబుధాబి ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన ఈ కార్యక్రమానాకి వందల సంఖ్యలో తెలుగు కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ చేసిన సంగీత విభావరీ అందరినీ ఆకట్టుకుంది. మిమిక్రీ ఆర్టిస్ట్ రాజు, జబర్దస్త్ ఫేమ్ యడం రాజు, భాస్కర్, రియాజ్ స్టాండింగ్ కామెడీ స్కీట్స్ అందరినీ కడుపుబ్బ నవ్వించాయి. ఈ వేడుకకు మీడియా పార్టనర్స్ గా మాగల్ఫ్, టీవీ5, టీవీ9, ఏబీఎన్ఆంధ్రజ్యోతి వ్యవహారించాయి.

తెలుగు అసోసియేషన్ అబుధాబి కోర్ కమిటీ సభ్యులు భాస్కర్ - గాయత్రి, భరత్ తేజ - ప్రసన్న, ధనంజయ్ - కీర్తి, దిలీప్ - షాలీని, కిషోర్ - రాధిక, నారాయణ - దేవీ, రమేష్ - ప్రసన్న లక్ష్మీ, రవి - శ్రీదేవీ ప్రసన్న, శ్రావణ్ - స్రవంతి , శ్రీకాంత్ - కవిత, వెంకట్ - రమ్య, హరి - హరిత, విష్ణు - సమీరలు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కమ్యూనిటీ సభ్యులు ఏర్పాట్ల పై సంతృప్తి వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com