రియాద్‌ మెట్రోతో స్థానికులకు 23,000 ఉద్యోగాలు

- May 06, 2016 , by Maagulf
రియాద్‌ మెట్రోతో స్థానికులకు 23,000 ఉద్యోగాలు

రియాద్‌ గవర్నర్‌ ప్రిన్స్‌ ఫైసల్‌ బిన్‌ బందార్‌ మల్టీ బిలియన్‌ రియాల్‌ ఖర్చుతో నిర్మిస్తున్న రియాద్‌ మెట్రో 23,000 మంది స్థానికులకు ఉద్యోగాల్ని కల్పిస్తుందని అన్నారు. నిర్మాణ సమయంలోనూ, కార్యకలాపాలు ప్రారంభమయ్యాక పెద్దయెత్తున మెట్రో ప్రాజెక్ట్‌ ఉద్యోగాలను కల్పిస్తుందని గవర్నర్‌ చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌తో ఎంఓయూ సందర్భంగా కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌ పరిశీలన సమయంలో గవర్నర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్‌ ప్రాగ్రెస్‌ని గవర్నర్‌కి లేబర్‌ మినిస్టర్‌ ముఫ్రెజ్‌ అల్‌ హకాబని మరియు ఫైనాన్స్‌ మినిస్టర్‌ ఇబ్రహీమ్‌ అల్‌ అసాఫ్‌ వివరించారు. 2018 నాటికి ఈ ప్రాజెక్ట్‌ పూర్తవుతుందని ప్రిన్స్‌ ఫైసల్‌ తెలిపారు. ట్రైనింగ్‌, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్స్‌, కో-ఆపరేషన్‌ ప్రోగ్రామ్స్‌ విత్‌ యూనివర్సిటీస్‌.. ఇవన్నీ కలగలిసి ప్రాజెక్ట్‌ అత్యద్భుతంగా పూర్తి అవుతుందనీ, సౌదీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేదిగా ఈ ప్రాజెక్ట్‌ ఉండాలని ఆకాంక్షించారు గవర్నర్‌ ఫైసల్‌. నిర్మాణ సమయంలో ఎంతో ఓర్పుతో వ్యవహరిస్తున్న రియాద్‌ వాసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సౌదీ అభివృద్ధిలో పౌరుల పాత్రను ఆయన కొనియాడారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com