రమదాన్: కిరాణా వస్తువులపై 70% వరకు ఆదా చేయడం ఎలా?

- March 23, 2023 , by Maagulf
రమదాన్: కిరాణా వస్తువులపై 70% వరకు ఆదా చేయడం ఎలా?

యూఏఈ: పవిత్ర రమదాన్ మాసంలో కిరాణా వస్తువులపై 70 శాతం ఆపై ఆదా చేసుకునేందుకు ప్రమోషన్‌లను సద్వినియోగం చేసుకోవాలని దుబాయ్‌లోని రిటైలర్లు వినియోగదారులకు సూచించారు. యూనియన్ కోప్, అల్ మాయా, నూన్ వంటి అనేక రిటైలర్లు వినియోగదారులకు పవిత్ర మాసానికి సంబంధించి ప్రమోషన్లు, డిస్కౌంట్లను ప్రకటించాయి.

జాతీయ స్థాయిలో అన్ని మార్కెట్‌ప్లేస్‌లలో ఆహార భద్రతను సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ-మద్దతుగల రిటైలర్ యూనియన్ కోప్ తన ప్రకటనలో తెలిపింది.  యూనియన్ కోప్ దాని విలువైన వినియోగదారుకు ఈ రమదాన్ మాసంలో అనేక ఎంపికలను అందిస్తుందని పేర్కొంది.  తద్వారా సగటు వినియోగదారులు ఆదా చేయచ్చని తెలిపింది. జిసిసి నుండి సేకరించిన పౌల్ట్రీ ఉత్పత్తులు ధరలలో మార్పులు చోటుచేసుకున్నాయని, కానీ జిసిసియేతర పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలు అలాగే ఉన్నాయని తెలిపింది.

అల్ మాయా సూపర్‌మార్కెట్ కస్టమర్‌లకు వివిధ ఆఫర్‌లు, ప్రమోషన్‌లను సిద్ధం చేసింది. ఇందులో ఆహార, పానీయాల విక్రయాలపై అత్యధికంగా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని, ఆ తర్వాత గృహావసరాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు ఉన్నాయని అల్ మాయా గ్రూప్ గ్రూప్ డైరెక్టర్ కమల్ వచాని తెలిపారు.

రెడ్ స్టీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ ప్రకారం.. యూఏఈ, మేనా ప్రాంతంలోని వినియోగదారులు ఈ రమదాన్ సందర్భంగా ఆన్‌లైన్ ఉత్పత్తులను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందు కోసం అత్యధికంగా కమ్యూనిటీ ఛానెల్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటువంటి ఛానెల్‌లు వారికి వినియోగదారుల సమీక్షల విశ్వసనీయతను, డిజిటల్ ఉత్పత్తి ఆవిష్కరణ అనుభవాన్ని అందిస్తాయి. మేనాలోని జనాభాలో దాదాపు 95 శాతం మంది పవిత్ర మాసంలో ఉపవాసాలు ఆచరిస్తారు. ఈ సంవత్సరం ద్రవ్యోల్బణం ప్రభావం ఉన్నప్పటికీ మెనాలో రమదాన్ రిటైల్ అమ్మకాలు $66 బిలియన్లకు (Dh242.22 బిలియన్) చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

ఆన్‌లైన్ రిటైలర్ Noon.com బుధవారం పలు వస్తువులపై 70 శాతం వరకు తగ్గింపులను ప్రకటించింది. ఈ ఆఫర్లు మార్చి 27 నుండి ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయని పేర్కొంది. విమ్టో, రూహ్ అఫ్జా, నార్, మరెన్నో అగ్ర బ్రాండ్‌లు సైతం రమదాన్ సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com