5 మిలియన్లు దాటిన ఒమన్ జనాభా
- March 23, 2023
మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) ప్రకారం.. ఒమన్ సుల్తానేట్ జనాభా 5 మిలియన్ల మార్కును అధిగమించింది. మార్చి 22 నాటికి ఒమానీలు, నివాసితుల మొత్తం జనాభా 5,000,772 మిలియన్లకు చేరుకుంది. ఒమానీలు 2,881,313 మంది పౌరులతో( 57.62) శాతం ఉండగా.. నివాసితుల సంఖ్య 2,119,459 (42.38 శాతం) గా ఉంది.
డిసెంబర్ 2020లో ప్రకటించిన జనాభా, గృహాలు, సంస్థల ఎలక్ట్రానిక్ సెన్సస్ ప్రకారం.. 2010 జనాభా లెక్కలతో పోలిస్తే 10 సంవత్సరాలలో జనాభా 61 శాతం పెరిగింది. 2040 నాటికి సుల్తానేట్ ఆఫ్ ఒమన్ జనాభా 8 మిలియన్లకు చేరుకుంటుందని హౌసింగ్, అర్బన్ ప్లానింగ్ మంత్రి, హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ ఖల్ఫాన్ అల్ షుయైలీ తెలిపారు. ఒమన్ సుల్తానేట్ జనాభా 1980లో లక్షా 60 వేల మార్కును.. 1993లో రెండు మిలియన్ల స్థాయికి చేరుకుంది. 2009లో జనాభా 3.17 మిలియన్లకు చేరుకోగా, 2015లో అది 4 మిలియన్ల మార్కను దాటింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







