నాగశౌర్య జోరు పెంచాడు.!
- March 23, 2023
పక్కింటబ్బాయ్ ఇమేజ్ వున్న నాగశౌర్యకు ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. వరసపెట్టి సినిమాలు చేస్తూనే వున్నాడు. కానీ, సరైన హిట్ పడడం లేదు. మొన్న ‘వరుడు కావలెను’, తాజాగా ‘ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్’ అంటూ వచ్చాడు. రెండూ ఫ్లాప్ సినిమాలే.
అయినా తన పని తాను చెసేకుంటూ పోతున్నాడు. లేటెస్ట్‌గా కొత్త సినిమాని లాంఛ్ చేశాడు. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేశారు.
వింతగా కూసింత కొత్తగా వుండేలా ఈ టైటిల్ వుండడం ఆసక్తి కలిగిస్తోంది. ‘రంగబలి’ అంటూ ఈ సినిమాకి టైటిల్ పెట్టారు. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందనీ తెలుస్తోంది.
ఇంతవరకూ ప్రయోగాల మీద ప్రయోగాలు చేసిన నాగశౌర్య, తన జోనర్‌ని టచ్ చేయబోతున్నాడట ఈ సినిమాతో. పక్కింటబ్బాయ్ ఇమేజ్‌తో ‘రంగబలి’ని ఓ ఆహ్లాదకరమైన మూవీగా తీర్చి దిద్దుతున్నారనీ తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







