దుబాయ్ లో భారీగా ట్రాఫిక్ జామ్!
- March 25, 2023
దుబాయ్: శనివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి ట్రాఫిక్ నెమ్మదిగా జరుగుతుందని వాహనదారులను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) హెచ్చరించింది. దుబాయ్ వరల్డ్ కప్(గుర్రాల పోటీ) మార్చి 25న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్టీఏ ట్రాఫిక్ అలెర్ట్ జారీ చేసింది. అల్ మేడాన్ సెయింట్, అల్ ఖైల్ రోడ్, దుబాయ్-అల్ ఐన్ రోడ్లతో సహా - మధ్యాహ్నం 1 గంటల నుంచి అర్ధరాత్రి మధ్య కొన్ని రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. డ్రైవర్లు ముందుగానే బయలుదేరడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని RTA సూచించింది. దుబాయ్ ప్రపంచ కప్ - ఇది మైదాన్ రేస్‌కోర్స్‌లో జరుగుతుంది. మొత్తం $30.5 మిలియన్ల ప్రైజ్ పూల్ కోసం 12 దేశాల నుండి 126 గుర్రాలు పోటీపడుతున్నాయి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







