ఆధార్–పాన్ లింక్:ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు
- March 25, 2023
న్యూ ఢిల్లీ: పాన్ కార్డు కలిగి ఉన్నవారికి మరోసారి హెచ్చరిస్తున్నాం. మీ పాన్ నంబర్-ఆధార్ నంబర్‌తో లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 తర్వాత ఇక చెల్లుబాటు కాదు. మీ పాన్ ఆధార్ లింక్ చేసేందుకు మార్చి 31, 2023 నాటికే గడువు ఉంది. అప్పట్లోగా లింక్ చేయకపోతే మీ పాన్ కార్డు పని చేయకుండా పోతుంది. ఎలాంటి లావాదేవీలు చేయలేరు. ఇప్పుడు ఏ చిన్న ఆర్థిక లావాదేవీ నిర్వహించాలన్న పాన్ కార్డు అడుగుతున్నారు. కాబట్టి వెంటనే పాన్-ఆధార్ లింక్ (PAN Aadhaar link Status) చేయండి. అయితే, ఇప్పటికే తాము పాన్ కార్డ్-ఆధార్ కార్డు లింక్ చేశామని చాలా మంది భరోసాగా ఉంటున్నారు. అయితే, ఈ రెండు కార్డులు లింక్ కాకోపతే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. అందుకో మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్‌తో లింక్ అయిందో లేదో ఓసారి స్టేటస్ తెలుసుకోవడం చాలా మంచిది. స్టేటస్ ఏ విధంగా చెక్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పాన్-ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా?
పాన్ ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకునేందుకు ముందుగా https://www.incometax.gov.in/ వెబ్సైట్ లోకి వెళ్లాలి.
ఎడమ వైపు క్విక్ లింక్స్‌లో లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ పాన్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి
నంబర్లు ఎంటర్ చేసిన తర్వాత స్మబిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మీ పాన్-ఆధార్ లింక్ అయిందో లేదో మీకో అలర్ట్ కనిపిస్తుంది.
ఒకవేళ పాన్-ఆధార్ లింక్ కానట్లయితే మార్చి 31లోపు రూ.1000 చెల్లించి లింక్ చేయాలి.
ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం పాన్ కార్డు ఉన్న వారందరూ (మినహాయింపు జాబితాలోకి రానివారు) తమ పాన్ నంబర్‌ను ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ చేయాలి. లింక్ చేయాని పాన్ కార్డులు ఏప్రిల్ 1, 2023 నుంచి పని చేయకుండా పోతాయి. ప్రస్తుంత ఉన్న అవకాశంలోనూ జరిమానాతోనే గడువు ఇచ్చింది ఆదాయపు పన్ను శాఖ. 2023, మార్చి 31లోపు లింక్ చేయాలంటే రూ.1000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఒక వేళ గడువులోపు పూర్తి చేయకుంటే మీ పాన్ కార్డు ఎలాంటి లావాదేవీలకు పనికి రాదు. మీకు ఏవైనా రీఫండ్స్ రావాల్సి ఉన్నట్లయితే అవి నిలిచిపోతాయి. అలాగే ఏవైనా లోపాలు ఉన్న రిటర్న్స్‌ను సైతం సరిచేయడం కుదరదు. దీని ఫలితంగా ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఈ చిక్కులు ఎదుర్కోకుండా ఉండాలంటే వెంటనే మీ పాన్ కార్డు, ఆధార్ నంబర్ లింక్ చేసుకోండి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







