మరో భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో కౌంట్ డౌన్
- March 25, 2023
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో భారీ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. శాస్త్రవేత్తలు మార్చి 26న షార్ నుండి ఎల్వీఎం–3 రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఎల్‌వీఎం-3 వాహకనౌక ద్వారా 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు కౌంట్ డౌన్ మొదలైంది. గురువారం నిర్వహించిన రిహార్సల్స్ విజయవంతం అయ్యాయి. దీంతో మార్చి 26వ తేదీన ఆదివారం రాత్రి ఉదయం గంటలకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది.
మొదటి విడతలో 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబరు 23న ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తాజాగా 36 ఉపగ్రహాలను ఎల్‌వీఎం-3 రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు. 5,805 కేజీలు బరువు కలిగి ఉన్న 36 ఉపగ్రహాలను 450 కి.మీ. ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపనున్నారు. 36 వన్‌వెబ్ ఉపగ్రహాలతో కూడిన మొదటి బ్యాచ్‌ను గత ఏడాది అక్టోబర్ 23న శ్రీహరికోట నుండి విజయవంతంగా ప్రయోగించింది.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







