వేసవి సహజ పానీయం మజ్జిగతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.?
- March 25, 2023వేసవి తాపాన్ని తట్టుకోవడానికైనా, శరీర ఉష్ణోగ్రతని చల్లబర్చి డీహైడ్రేషన్ నుంచి తప్పించాలన్నా మజ్జిగ బెస్ట్ పానీయం. అందుకే సమ్మర్లో సహజ పానీయంగా మజ్జిగను అభివర్ణిస్తుంటారు.
అవును నిజమే ఇది అందరికీ తెలిసిందే. అయితే, మజ్జిగతో వచ్చే మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ఇంకాస్త ఆశ్చర్యపోతారు. ఇంతవరకూ మజ్జిగ అలవాటు లేని వాళ్లు కూడా అలవాటు చేసుకుంటారు.
మలబద్ధకం అనేది ఎవరికీ చెప్పుకోలేని అతి తీవ్రమైన సమస్య. ఈ సమస్యకు మజ్జిగ మంచి పరిష్కారం. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుండడం వల్ల పేగుల కదలికను సులభం చేస్తుంది. తద్వారా ఆ సమస్యకు ఉపశమనం కలుగుతుంది.
మజ్జిగలో వుండే ఎలక్ర్టోలైట్లు వడదెబ్బ నుంచి మనల్ని కాపాడతాయ్. తక్షణ శక్తినిచ్చే రిబో ఫ్లోవిన్ మజ్జిగలో ఎక్కువగా వుంటుంది. దాంతో కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.
జీర్ణ క్రియలో ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా గ్లాసుడు మజ్జిగ తాగితే ఎసిడిటీ తదితర అసౌకర్యాలు తీరి, అంతా సెట్ అవుతుంది.
తాజా వార్తలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన