టర్కిష్ సిటీలో 'కింగ్ ఆఫ్ బహ్రెయిన్ అవెన్యూ'
- March 26, 2023బహ్రెయిన్: కహ్రమన్మరాస్ ప్రావిన్స్‌లోని టర్కిష్ నగరం ఎల్బిస్తాన్ "కింగ్ ఆఫ్ బహ్రెయిన్ అవెన్యూ" పేరుతో ఒక అవెన్యూని ప్రారంభించింది. ఈ సందర్భంగా హ్యుమానిటేరియన్ వర్క్ అండ్ యూత్ అఫైర్స్ కోసం రాజు ప్రతినిధి, హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా.. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు అభినందనలు తెలిపారు. బహ్రెయిన్-టర్కిష్ సంబంధాల ఆధారంగా దేశంలో సంభవించిన వినాశకరమైన భూకంపం ప్రభావితమైన ప్రాంతాల్లో అందించిన సహాయానికి గుర్తుగా పేరును మార్పు చేసినట్లు పేర్కొన్నారు. "కింగ్ ఆఫ్ బహ్రెయిన్ స్ట్రీట్" అల్ బస్తాన్ సిటీలోని ఒక వ్యూహాత్మక ప్రదేశంలో ఉందని డాక్టర్ ముస్తఫా అల్-సయ్యద్ పేర్కొన్నారు. ఇది వినాశకరమైన భూకంపంలో తీవ్రంగా నష్టపోయింది. టర్కియేలోని సోదరుల పట్ల హెచ్ఎం రాజు గొప్ప మానవతా దృక్పథాలను స్మరించుకోవడానికి బహ్రెయిన్ రాజు పేరు మీద ఈ అవెన్యూ పేరు పెట్టబడిందని అతను తెలిపారు. శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి హైకమిషనర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని, భూకంపం వల్ల ప్రభావితమైన వారికి సహాయం అందించడానికి, విద్య -ఆరోగ్యాన్ని ఏర్పాటు చేయడానికి టర్కీ రెడ్ క్రెసెంట్, ఫారిన్ ఎకనామిక్ రిలేషన్స్ బోర్డ్ ఆఫ్ టర్కీ (DEiK) తో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు