షార్జాలో 50% ట్రాఫిక్ జరిమానా తగ్గింపు..
- March 27, 2023
యూఏఈ: షార్జాలో ట్రాఫిక్ జరిమానాలపై వాహనదారులకు 50 శాతం తగ్గింపును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని మార్చి 2న ప్రకటించారు. ట్రాఫిక్ జరిమానాలను సగానికి (50 శాతం) తగ్గించడంతో పాటు మార్చి 31, 2023లోపు ఉల్లంఘనలకు సంబంధించిన ఇంప్యూండ్మెంట్ ఆర్డర్లు, బ్లాక్ పాయింట్లు రద్దు చేయబడతాయని షార్జా పోలీస్‌లోని ట్రాఫిక్ -పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్-కల్నల్ ముహమ్మద్ అలై తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని.. ఉల్లంఘనకు పాల్పడిన తేదీ నుండి 60 రోజులలోపు జరిమానా చెల్లించినట్లయితే వాహనదారులు 35 శాతం తగ్గింపును పొందుతారు. ఉల్లంఘించిన 60 రోజుల నుంచి ఏడాదిలోపు జరిమానా చెల్లిస్తే వాహనదారులకు 25 శాతం రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







