రమదాన్: మోసపూరిత ఫిషింగ్ ప్రచారాలపై NCSA హెచ్చరిక
- March 27, 2023
దోహా: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా నకిలీ పెట్టుబడి , రాయితీలు ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్నాయని, వీటి ముసుగులో మోసపూరిత ఫిషింగ్ ప్రమాదాలు పొంచిఉన్నాయని ఖతార్‌లోని నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) హెచ్చరించింది. కొన్ని నకిలీ ప్రచారాలు అనేక జాతీయ ఖతార్ సంస్థల వలె కనిపిస్తాయని, ఈ ప్రచారాలకు స్పందించవద్దని, వారు సూచించిన లింక్ లను ఓపెన్ చేయొద్దని NCSA హెచ్చరించింది. సాధారణంగా ఫిషింగ్ ప్రచారాల కోసం సైబర్ మోసగాళ్లు ఉచిత, ఓపెన్ సోర్స్ "Wordpress" వ్యవస్థను కూడా ఉపయోగిస్తాయని తెలిపింది. వాటిని అధికారిక సంస్థలు ఉపయోగించవని గుర్తించాలన్నారు. సైబర్ మోసగాళ్లు వ్యక్తిగత బ్యాంకింగ్ డేటాను అడుగుతారని, ఆర్థిక పెట్టుబడి - తగ్గింపు ఆఫర్ల ద్వారా ప్రజలను ఆకర్షించడానికి ప్రకటనలు ఇస్తారని తెలిపారు. ఖతార్‌లోని అధికారిక అధికారులు దరఖాస్తుదారుల నుండి వ్యక్తిగత డేటాను అభ్యర్థించరని, అన్ని అధికారిక లావాదేవీలు "హుకూమి" ప్లాట్‌ఫారమ్ లేదా జాతీయ డాక్యుమెంటేషన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా నిర్వహించబడతాయని NCSA గుర్తు చేసింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







