ప్రముఖ రెస్టారెంట్ చైన్ వ్యవస్థాపకుడు కన్నుమూత
- March 28, 2023
యూఏఈ: ప్రసిద్ధ అంతర్జాతీయ రెస్టారెంట్ చైన్ దిన్ తాయ్ ఫంగ్‌ను స్థాపించిన యాంగ్ బింగ్-యి.. 96 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఈ మేరకు కంపెనీ ప్రకటించింది. మరణానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే అంత్యక్రియల ఏర్పాట్లు కొనసాగుతున్నందున కుటుంబ సభ్యులు గోప్యత కోరినట్లు కంపెనీ తెలిపింది. యాంగ్ బింగ్-యి విజయగాథ చాలా సంవత్సరాలుగా విస్తృతంగా ప్రచారంలో ఉంది. అతను 1947లో 20 సంవత్సరాల వయస్సులో కేవలం 20 డాలర్లు జేబులో పెట్టుకుని తైవాన్‌కు వెళ్లాడు. మొదట్లో తైవాన్‌లో వంట నూనెల వ్యాపారాన్ని స్థాపించడంతో ప్రారంభమైంది. మొదటగా తన భార్యతో కలిసి ఆవిరితో కూడిన చైనీస్ సూప్ కుడుములు లేదా జియావో లాంగ్ బావోను విక్రయించడం ప్రారంభించాడు. అనంతర కాలంలో యూఏఈ, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, సింగపూర్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా తన రెస్టారెంట్ల చైన్ ను యాంగ్ బింగ్-యి విస్తరించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!







