ప్రముఖ రెస్టారెంట్ చైన్ వ్యవస్థాపకుడు కన్నుమూత

- March 28, 2023 , by Maagulf
ప్రముఖ రెస్టారెంట్ చైన్ వ్యవస్థాపకుడు కన్నుమూత

యూఏఈ: ప్రసిద్ధ అంతర్జాతీయ రెస్టారెంట్ చైన్ దిన్ తాయ్ ఫంగ్‌ను స్థాపించిన యాంగ్ బింగ్-యి.. 96 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఈ  మేరకు కంపెనీ ప్రకటించింది. మరణానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే అంత్యక్రియల ఏర్పాట్లు కొనసాగుతున్నందున కుటుంబ సభ్యులు గోప్యత కోరినట్లు కంపెనీ తెలిపింది.  యాంగ్ బింగ్-యి విజయగాథ చాలా సంవత్సరాలుగా విస్తృతంగా ప్రచారంలో ఉంది. అతను 1947లో 20 సంవత్సరాల వయస్సులో కేవలం 20 డాలర్లు జేబులో పెట్టుకుని తైవాన్‌కు వెళ్లాడు. మొదట్లో తైవాన్‌లో వంట నూనెల వ్యాపారాన్ని స్థాపించడంతో ప్రారంభమైంది. మొదటగా తన భార్యతో కలిసి ఆవిరితో కూడిన చైనీస్ సూప్ కుడుములు లేదా జియావో లాంగ్ బావోను విక్రయించడం ప్రారంభించాడు. అనంతర కాలంలో యూఏఈ, అమెరికా, యూకే,  ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, సింగపూర్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా తన రెస్టారెంట్ల చైన్ ను యాంగ్ బింగ్-యి విస్తరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com