లోకల్ యాక్సిలేటర్ ప్రోగ్రామ్ యంగెస్ట్ విన్నర్స్..!

- March 29, 2023 , by Maagulf
లోకల్ యాక్సిలేటర్ ప్రోగ్రామ్ యంగెస్ట్ విన్నర్స్..!

దుబాయ్: 8 ఏళ్ల దేవి, 6 ఏళ్ల  ఆమె సోదరి మీరాలు యూఏఈలో స్థానిక వ్యాపార యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లో అతి పిన్న వయస్కురాలైన విజేతలుగా నిలిచారు.  ఈ యంగెస్ట్ సిస్టర్స్ మదర్ అనుప మాట్లాడుతూ.. దేవికి చిన్నప్పటినుంచి వంటలంటే ఇష్టమన్నారు. తాను వారి కోసం రుచికరమైన, ఆరోగ్యకరమైన కుకీ రెసిపీని రూపొందించింది. నేడు అదే కుకీ రెసిపీ చిన్నారులను విజేతలుగా నిలిపింది. దేవి తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందించేలా కుకీలను తయారు చేసినట్టు తెలిపారు. అయితే, ఇది వాణిజ్యపరంగా ఉత్పత్తి అవుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదన్నారు. తల్లి నుంచి కుకీల తయారీని నేర్చుకున్న దేవి(బాబీ), మీరా(రాకీ)లు తమ ముద్దుపేర్లు వచ్చేలా బాబ్‌రాక్జ్ కుకీలను తయారు చేసి పేరు గడించారు. వీటి తయారిలో ఆరోగ్యకరమైన పదార్థాలు.. గుమ్మడి గింజలు, ఎండబెట్టిన ఖర్జూరాలు, ఎర్ర బియ్యం, ముంగ్ బీన్స్, కాయధాన్యాలు, పప్పులు వంటి మొక్కల ఆధారిత పదార్థాలను ఉపయోగిస్తారు. సాధారణంగా ఉపయోగించే గ్లూటెన్, నట్స్, రిఫైన్డ్ షుగర్, కృత్రిమ రుచులు, ప్రిజర్వేటివ్‌లు, పామాయిల్ వంటి హానికరమైన పదార్థాల వినియోగానికి వీరు దూరంగా ఉంటారు. దేవి, మీరా చదివే స్విస్ ఇంటర్నేషనల్ స్కూల్ దుబాయ్‌లోని ఉపాధ్యాయుల సూచనతో వింటర్ ఫెయిర్‌లో తొలిసారి తమ ఉత్పత్తులను విక్రయించినట్లు అనుప తెలిపారు. అనంరతం కాలంలో అనేక స్కూల్ ఫెయిర్‌లలో విక్రయించామని, మంచి పేరు రావడంతో కమర్షియల్ ఉత్పత్తి, విక్రయాల కోసం లైసెన్స్ తీసుకున్నామని వారు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com