ఆ రహదారిపై స్లోగా డ్రైవింగ్ చేస్తే.. Dh400 జరిమానా
- March 31, 2023
యూఏఈ: ఏప్రిల్ నుండి అబుధాబి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ రోడ్లో కనిష్టంగా 120kmph వేగాన్ని అమలు చేయనుంది. మే 1 నుండి ఈ నిబంధన ఉల్లంఘించినవారికి Dh400 జరిమానా విధించబడుతుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రధాన రహదారిపై గరిష్ట వేగం గంటకు 140కిమీగా ఉంటుందని, ఎడమవైపు నుండి మొదటి, రెండవ లేన్లలో కనిష్టంగా 120కిమీ వేగం వర్తిస్తుందని అబుధాబి పోలీసు అధికారులు వివరించారు. కనీస వేగం పేర్కొనబడని మూడవ లేన్‌లో నెమ్మదైన వాహనాలను అనుమతించబడుతుందని పేర్కొన్నారు. రోడ్డు చివరి లేన్‌ను ఉపయోగించాల్సిన భారీ వాహనాలు కనీస వేగ నియమానికి లోబడి ఉండవని పోలీసులు చెప్పారు. ఏప్రిల్‌లో ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత నిర్దేశించిన లేన్లలో గంటకు 120కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో డ్రైవింగ్ చేస్తే పట్టుబడిన వారికి హెచ్చరిక నోటీసులు జారీ చేయబడతాయని, ఆ తర్వాత మే 1న 400 దిర్హామ్‌ల జరిమానా వర్తిస్తుందని సెంట్రల్ ఆపరేషన్స్ సెక్టార్ డైరెక్టర్ మేజర్-జనరల్ అహ్మద్ సైఫ్ బిన్ జైటూన్ అల్ ముహైరి తెలిపారు.
తాజా వార్తలు
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం
- బ్రెజిల్లో భారీ ఆపరేషన్–60 మంది గ్యాంగ్ సభ్యుల హతం
- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
- APNRTS డైరెక్టర్–ఆపరేషన్స్ (సర్వీసెస్)గా నాగేంద్ర బాబు అక్కిలి నియామకం
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!







