ఇస్లాం ప్రవక్తలకు అవమానం.. ముగ్గురికి ఏడాది జైలుశిక్ష
- March 31, 2023
బహ్రెయిన్: ఇస్లాం మత నియమాలను ఉల్లంఘించినందుకు, ప్రవక్తలను కించపరిచినందుకు బహ్రెయిన్ నాల్గవ క్రిమినల్ కోర్టు గురువారం ముగ్గురు దోషులకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. 'అల్-తాజ్దీద్ కల్చరల్ అండ్ సోషల్ సొసైటీ'లో సభ్యులుగా ఉన్న ఈ ముగ్గురిపై మోపిన ఆరోపణలపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాత శిక్షలను ఖరారు చేసింది. సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యాంటీ-సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సూచన మేరకు ముగ్గురు నిందితులు ఇస్లాం సిద్ధాంతాలను ఉల్లంఘించినందుకు ప్రవక్తలను అవమానించినందుకు కోర్టు వారిని దోషులుగా నిర్ధారించింది. నిందితులు ఇస్లామిక్ విశ్వాసంపై అనుమానం కలిగేలా.. ప్రవక్తలను అవహేళన చేస్తూ ఇంటర్నెట్లో బ్లాగులు, వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా ఇస్లామిక్ మతం ప్రాథమికాలను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







