పాపం హరీష్ శంకర్.! పవన్ విషయంలో కన్‌ఫ్యూజన్ తీరడం లేదా.?
- March 31, 2023
ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలు.. ఇలా రెండు పడవల ప్రయాణంతో పవన్ కళ్యాణ్ చాలా చాలా బిజీగా వున్నాడు.
ఒప్పుకున్న ప్రాజెక్టులు ఎలాగైనా పూర్తి చేయాలి. కానీ, చాలా తక్కువ డేట్లు మాత్రమే కేటాయించాలి. దీంతో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఒకింత ఇబ్బందిగానే ఫీలవుతున్నారు.
కాగా, పవన్‌తో సినిమా కోసం హరీష్ శంకర్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశాడు. ఆగిపోతుందనుకున్న ప్రాజెక్ట్ ఎట్టకేలకు స్టార్ట్ అయ్యింది. కానీ, హరీష్ శంకర్ ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే వున్నాడట.
హరీష్ సినిమాతో పాటూ, పవన్ కళ్యాణ్ సుజిత్‌తో ‘ఓజీ’ సినిమా చేయాల్సి వుంది. ఈ రెండూ ఒకేసారి పూర్తి చేస్తాడని అనుకుంటున్నారంతా. అయితే, అది జరిగేలా లేదు.
హరీష్ శంకర్‌ని వెనక్కి పెట్టి, సుజిత్ సినిమాని పూర్తి చేయాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ వున్నాడన్న ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి, అలా జరిగితే, హరీష్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంకా దూరం జరిగిపోయే ప్రమాదముంది. ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







