విడాకుల విషయంలో సమంత కెలుకుడు.! సింపతీ కోసమేనా.?
- March 31, 2023
సమంత నటించిన ‘శాకుంతలం’ త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా వేగవంతం చేసింది తాజాగా చిత్ర యూనిట్. అందులో భాగంగానే ‘మల్లికా మల్లికా..’ అంటూ సాగే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
మరోవైపు సమంత ఇంటర్వ్యూల్లో యాక్టివ్‌గా పాల్గొంటోంది. ఈ క్రమంలోనే నాగ చైతన్యతో విడాకుల ఇష్యూని మళ్లీ తెరపైకి తీసుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది.
వైవాహిక జీవితంలో తాను ఎంత నిజాయితీగా వున్నా వర్కవుట్ కాలేదు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ చేయడం పట్ల తనను తన కుటుంబ సభ్యులే ఫోన్లు చేసి తిట్టేవారనీ, విడాకులు తీసుకున్నంత మాత్రానా తానేం తప్పు చేయలేదనీ సమంత వ్యాఖ్యానించింది.
తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి.. ఈ రెండేళ్లలో తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి మానసికంగా శారీరకంగా తానెంతో ధృఢపడ్డాననీ ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాననీ సమంత వ్యాఖ్యానించింది.
సమంత మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్. గడిచిపోయిన పుస్తకాన్ని సమంత మళ్లీ ఎందుకు తెరిచి తీసింది.? ‘శాకుంతలం’ సినిమాకి సింపతీతో కూడిన కొత్త పబ్లిసిటీనా.. అంటూ ట్రోల్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం







