సౌదీ మాజీ ఆరోగ్య మంత్రి ఒసామా శోబోక్షి కన్నుమూత
- April 01, 2023
జెడ్డా : సౌదీ అరేబియా మాజీ ఆరోగ్య మంత్రి, జర్మనీలో మాజీ రాయబారి డాక్టర్ ఒసామా శోబోక్షి (80) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మరణించారు. శుక్రవారం అసర్ ప్రార్థన అనంతరం జెడ్డాలోని జుఫాలీ మస్జీదులో అంత్యక్రియలు నిర్వహించారు. అనేకమంది వైద్యులు, మీడియా నిపుణులు, కార్యకర్తలు డాక్టర్ శోబోక్షికి సంతాపం తెలిపారు. అనేక రంగాల్లో ఆయన చేసిన కృషిని, సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
డాక్టర్ ఒసామా శోబోక్షి 1943లో జెడ్డాలో జన్మించారు. అతను జర్మనీలోని ఎర్లాంజెన్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్నల్ మెడిసిన్‌లో PhD పొందారు. ఐరిష్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ నుండి గౌరవ ఫెలోషిప్ సాధించారు. శోబోక్షి జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్‌లో లెక్చరర్‌గా పనిచేశారు. అతను ఆరోగ్య సంరక్షణ రంగంలో అనేక పదవులను కూడా నిర్వహించారు. అతను అనేక హాస్పిటల్ బోర్డులలో సభ్యుడిగా.. జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వవిద్యాలయం డైరెక్టర్ గా సేవలు అందించారు. డాక్టర్ శోబోక్షి 1416 AH నుండి 1424 AH వరకు ఫహద్ రాజు పాలనలో ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. ఆపై రాయల్ కోర్ట్‌లో సలహాదారుగా ఉన్నారు. ఆ తరువాత అతను జర్మనీలో సౌదీ రాయబారిగా సేవలు అందించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







