గల్ఫ్ నుండి 9 కిలోల బంగారం స్మగ్లింగ్.. ముంబై విమానాశ్రయంలో అరెస్ట్
- April 04, 2023
ముంబై: ఇండియాలో భారీ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని కస్టమ్ అధికారులు భగ్నం చేశారు. గల్ఫ్ దేశం నుంచి వస్తున్న వ్యక్తిని ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు అరెస్ట్ చేసి రూ.4.62 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముంబై కస్టమ్స్ ప్రకారం.. శనివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 9,000 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల బంగారు కడ్డీలను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.4.62 కోట్లు ఉంటుందని కస్టమ్స్ డిపార్ట్మెంట్ తెలిపింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. రూ.1.40 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు విదేశీ పౌరులను ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ విదేశీ పౌరులు అడిస్ అబాబా నుండి ముంబైకి వచ్చారు.
తాజా వార్తలు
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్







