ఒమన్ లో ప్రారంభమైన గులాబీ పంట సీజన్
- April 04, 2023
మస్కట్: అదఖిలియా గవర్నరేట్ అల్ జబల్ అల్ అఖ్దర్ విలాయత్‌లో గులాబీ పంట సీజన్ ప్రారంభమైంది. 3,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో.. 7 నుండి 10 ఎకరాల విస్తీర్ణంలో 5,000 కంటే ఎక్కువ గులాబీ చెట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆ చెట్ల నుంచి 28,000 లీటర్ల రోజ్ వాటర్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. అల్ జబల్ అల్ అఖ్దర్‌లో గులాబీ పంట కాలం పర్యాటకానికి ప్రసిద్ధి చెందింది. గులాబీ పంట సీజన్ పర్యాటకులు సాంప్రదాయ, ఆధునిక పద్ధతులను నిశితంగా పరిశీలించడానికి వీలు కల్పిస్తుందని అడాఖిలియా గవర్నరేట్‌లోని హెరిటేజ్ అండ్ టూరిజం అసిస్టెంట్ డైరెక్టర్ అలీ సైఫ్ అల్ షుకైలీ అన్నారు. సీజన్ మార్చి చివరి నుండి ప్రారంభమై.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మధ్య వరకు కొనసాగుతుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే రోజ్ వాటర్ ను అలంకార ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, స్వీట్లు, ఒమానీ కాఫీలలో ఉపయోగిస్తారని అల్ షుకీలీ తెలిపారు. అల్ జబల్ అల్ అఖ్దర్‌లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ ప్రాముఖ్యతను ఇస్తుందని, ముఖ్యంగా పర్యాటక రిసార్ట్‌లు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌ల వంటి పర్యాటక ప్రాజెక్టులలో మంచి పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







