హమద్ విమానాశ్రయంలో 3,579.5 గ్రాముల హషీష్ సీజ్
- April 04, 2023
దోహా: దేశంలోకి హషీష్ (గంజాయి)ని అక్రమంగా తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అథారిటీ భగ్నం చేసింది. ఒక ప్రయాణికుడి బ్యాగ్‌ని తనిఖీ చేయగా.. 3,579.5 గ్రాముల హషీష్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారి తెలిపారు. నిందితులు సబ్బుల ప్యాకింగ్‌లో హషీష్‌ను దాచి స్మగ్లింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోకి అక్రమ వస్తువులను తీసుకురావద్దని కస్టమ్స్ శాఖ హెచ్చరిస్తోంది. ప్రయాణీకుల బాడీ లాంగ్వేజ్‌ని,స్మగ్లర్లు అనుసరిస్తున్న తాజా పద్ధతుల గురించి తెలుసుకోవడం కోసం లేటేస్ట్ టెక్నాలజీ పరికరాల ఉపయోగం, నిరంతర శిక్షణతో ఇలాంటి కార్యక్రమాలను అడ్డుకుంటున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







