రష్మిక మండన్నా ‘రంగు’ల ప్రయోగం.!

- April 04, 2023 , by Maagulf
రష్మిక మండన్నా ‘రంగు’ల ప్రయోగం.!

నేషనల్ క్రష్ రష్మిక మండన్నా సరికొత్త అవతారమెత్తబోతోంది. ఆమె ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘రెయిన్‌బో’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది.

కాగా, ఈ సినిమాలో రష్మిక మండన్నా పాత్ర చాలా కొత్తగా వుండబోతోందట. డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడుకున్నదని తెలుస్తోంది. రొమాంటిక్ ఫాంటసీ నేపథ్యమనీ అంటున్నారు. కొత్త దర్శకుడు శాంతరూబన్ ఈ సినిమాకి దర్శకుడు. 

తొలిసారి రష్మికా మండన్నా లేడీ ఓరియెంటెడ్ రోల్ పోషిస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై విశేషమైన ఆసక్తి నెలకొంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో మేల్ లీడ్ పోషిస్తున్నాడు. తాజాగా స్టార్ట్ అయిన ఈ సినిమా ఏప్రిల్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com