ఈ సారి పూరీ స్కెచ్ ఫలిస్తుందా.?
- April 04, 2023
పూరీ జగన్నాధ్‌తో సినిమా చేయాలని ఒకప్పుడు హీరోలు ఎగబడేవారు. పూరీ సినిమాల్లోని హీరోలకు అంత క్రేజ్ మరి. ఆయన సినిమాల్లో హీరోల రూటే సెపరేటు. అలా డిజైన్ చేస్తాడు హీరో క్యారెక్టరైజేషన్‌ని పూరీ జగన్నాధ్.
కానీ, అది ఒకప్పుడు. ఇప్పుడు పూరీ డైరీ ఖాళీ అయిపోయింది. బాబోయ్ పూరీతో సినిమానా.? అనే స్థాయికి వచ్చేసింది. ‘లైగర్’ సినిమా పూరీని బాగా దెబ్బ తీసేసింది.
దాంతో, కొన్నాళ్లుగా కామ్‌గా వుంటున్నాడు పూరీ జగన్నాధ్. మెగాస్టార్‌తో సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ, అది ఇప్పట్లో జరిగే ముచ్చట కానే కాదాయె.
అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, పూరీ జగన్నాధ్ ఓ అధిరిపోయే కాంబినేషన్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌తో పూరీ జగన్నాధ్ ఓ సినిమా తెరకెక్కించాలనుకుంటున్నాడట.
త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుందనీ తెలుస్తోంది. ఈ గాసిప్ బయటికి రాగానే, విశ్వక్ ఆటిట్యూడ్కీ, పూరీ టేకింగ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందని మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







