సిక్కింలో మంచు తుపాను...ఏడుగురు మృతి

- April 04, 2023 , by Maagulf
సిక్కింలో మంచు తుపాను...ఏడుగురు మృతి

గాంగ్టక్: సిక్కింలో మంచు తుపాను సంభవించింది. నాథూలా సరిహద్దు వద్ద మంచుచరియలు విరిగిపడిన ఘటనలో ఏడుగురు పర్యాటకులు మృత్యువాతపడ్డారు.మరో 12 మందికి గాయాలయ్యాయి. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సిక్కిం పోలీసులు, రాష్ట్ర టూరిజం అధికారులు, ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.

మధ్యాహ్నం తర్వాత ఈ ప్రాంతంలో ఒక్కసారిగా మంచు తుపాను సంభవించింది. పర్యాటకులు తప్పించుకునేలోపే వారిని భారీ మంచుచరియలు కప్పేశాయి. మంచు కింద ఇంకా చాలామంది పర్యాటకులు ఉండే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 22 మందిని కాపాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com