అమెరికా చరిత్రలో సంచలనం: హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్
- April 05, 2023
వాషింగ్టన్: అమెరికా రాజకీయ చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోర్న్ స్టార్ స్మార్మీ డేనియల్స్‌కు అక్రమ చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు.
మంగళవారం కోర్టు ఎదుట లొంగిపోయిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ఈ కేసులో ట్రంప్‌నకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఆయన తరపు న్యాయవాదులు చెబుతున్నారు. అయితే, షరతులు విధించే అవకాశం ఉంటుంది. కాగా, అమెరికా చరిత్రలోనే క్రిమినల్ అభియోగాలతో అరెస్ట్ అయిన తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డుల్లోకి ఎక్కడం గమనార్హం.
2006లో డొనాల్డ్ ట్రంప్.. తాన ఓ కార్యక్రమంలో కలుసుకున్నామనీ.. ఆ తర్వాత హోటల్లో శృంగారంలో పాల్గొన్నామని పోర్న్ స్టార్ డేనియల్స్ ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచేందుకు ట్రంప్ న్యాయవాది మైకేల్ కోహెన్ 2016 అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు డేనియల్స్‌కు డబ్బు ముట్టజెప్పారన్నది ఆరోపణ. అయితే, ఇది నిజమేనని కోహెన్ ఒప్పుకోవడం సంచలనంగా మారింది.
దీంతో ఈ కేసులో ట్రంప్‌పై క్రిమినల్ అభియోగాలు నమోదు చేయాలని గ్రాండ్ జ్యూరీ నిర్ణయించింది. ఆయనపై చేసిన ఆరోపణలను సీల్డ్ కవర్లో ఉంచారు. అందులో ట్రంప్‌పై 30 ఆరోపణలు ఉన్నట్లు సీఎన్ఎన్ వార్త సంస్థ తన కథనంలో వెల్లడించింది. వాటిని కోర్టులో 10-15 నిమిషాలు వినిపించడం జరుగుతుంది. కాగా, తాజాగా, డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్







