సౌదీలో 32 సంవత్సరాలలో రెండవ అత్యధిక వర్షపాతం నమోదు

- April 05, 2023 , by Maagulf
సౌదీలో 32 సంవత్సరాలలో రెండవ అత్యధిక వర్షపాతం నమోదు

రియాద్: సౌదీ అరేబియా తన చరిత్రలో 32 సంవత్సరాలలో రెండవ అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేసింది. గత జనవరిలో 1991-2020 కాలంతో పోలిస్తే సాధారణ రేటు కంటే ఎక్కువ వర్షాలు కురిసాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) ప్రకటించింది.  రాజ్యంలో చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని తన నివేదికలో పేర్కొంది.

1991-2020 కాలంతో పోలిస్తే, గత జనవరిలో అల్-ఖాసిమ్ స్టేషన్‌లో వర్షపాతం పరిమాణం 122.7 మిమీ నమోదైందని, ఇది చరిత్రలో అత్యధికమని తెలిపింది. ఉష్ణోగ్రతలకు సంబంధించి, జనవరిలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 2.3 °C పెరుగుదలను నమోదు చేసిందని NCM పేర్కొంది. ఇది 1991-2020 కాలంతో పోలిస్తే రెండవ అత్యధిక సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత అని వెల్లడించింది. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత విషయానికొస్తే, ఇది 0.2 ° C మాత్రమే స్వల్పంగా పెరిగిందని తెలిపింది. 1991-2020తో పోలిస్తే జనవరిలో సగటు ఉష్ణోగ్రత 1.1 ° C పెరిగిందని NCM పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com