మద్యం తయారీ యూనిట్ నడుపుతున్న దంపతుల అరెస్ట్
- April 05, 2023
కువైట్: మద్యం తయారీ యూనిట్ నడుపుతున్న ఆసియాకు చెందిన దంపతులను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మదీ సెక్యూరిటీ డైరెక్టరేట్ వివరాల ప్రకారం.. ఆసియాకు చెందిన ఒక వివాహిత జంట మద్యం తయారీని చేపట్టారని, అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్నారని, విశ్వసనీయ సమాచారం అందడంతో దంపతులు నడుపుతున్న మద్యం తయారీ స్థలంపై డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడి నుంచి మద్యం తయారీకి వినియోగించే పదార్థలతోపాటు అప్పటికే తయారు చేసి అమ్మేందుకు సిద్ధంగా ఉన్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆసియా జంటను అరెస్టు చేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం అధికారులకు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. నివేదికల ప్రకారం గత 24 గంటల్లో ఇలాంటి ఘటన ఇది రెండోది కావడం గమనార్హం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







